IPL 2019 : Kings XI Punjab Won The Toss And Elected To Field First | Oneindia Telugu

2019-03-27 49

In Match 6 of IPL 2019, Kings XI Punjab will take on Kolkata Knight Riders in the backdrop of mankading controversy at the Eden Gardens in Kolkata on Wednesday. Skipper R Ashwin is in the eye of a storm after 'Mankading' Jos Buttler but a winning start will keep Kings XI Punjab upbeat against home favourites Kolkata Knight Riders.
#IPL2019
#KKRvsKXIP2019
#KolkataKnightRidersvsKingsXIPunjab
#KolkataKnightRiders
#KingsXIPunjab
#ChrisGayle
#andrerussell
#EdenGardens

ఐపీఎల్ 2019లో భాగంగా కోల్‌కత్తా నైట్‌రైడర్స్, కింగ్ ఎలెవన్ పంజాబ్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన కింగ్ ఎలెవన్ పంజాబ్ జట్టు కెప్టెన్ అశ్విన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. కోల్‌కత్తా బ్యాటింగ్ చేయనుంది. ఈ మ్యాచ్‌లో పంజాబ్ ఏకంగా నాలుగు మార్పులు చేయడం విశేషం. పూరన్, శామ్ కుర్రాన్, అంకిత్ రాజ్‌పుత్, ముజీబ్ రహమన్‌లను జట్టులో నుంచి తప్పించిన పంజాబ్... వారి స్థానంలో మిల్లర్, విల్‌జోన్, వరుణ్ చక్రవర్తి, ఆండ్రూ టైలకు స్థానం కల్పించింది. పంజాబ్ జట్టు, రాజస్థాన్ రాయల్స్‌తో ఆడిన గత మ్యాచ్‌లో ‘మన్కడింగ్’ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. మ్యాచ్ మంచి రసపట్టుగా సాగుతున్న సమయంలో ‘మన్కడింగ్’ ద్వారా ఫామ్‌లో ఉన్న బ్యాట్స్‌మెన్ జోస్ బట్లర్‌ను అవుట్ చేశాడు పంజాబ్ కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్. ఇది కాస్తా క్రికెట్ ప్రపంచంలో పెను చర్చకు కారణమైంది.